- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు.. డీఎస్పీ రాజశేఖర్ రాజు

దిశ, మిర్యాలగూడ : చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం రాత్రి మిర్యాలగూడలో ఆపరేషన్ చెపుత్ర లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణ పరిసర నిర్జన ప్రదేశాలలో మద్యం, గాంజా సేవిస్తున్న 43 మంది యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 21 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణంలో ఎక్కడైనా పేకాట, గంజా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడినా, సహకరించినా చట్టపరమైన చర్యలు తప్పవని యువకులకు సూచించారు. నెంబర్ లేటు లేకుండా, పెద్ద చప్పుడుతో వాహనాలను నడిపిన శిక్ష తప్పదని అన్నారు. యువత తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంచే విధంగా బాధ్యత చేపట్టాలని సూచించారు. విద్యార్థులు చదువుకొని మంచి భవిష్యత్తు అందుకోవాలి తప్ప చెడు వ్యసనాలకు దగ్గర కావొద్దని అన్నారు. స్పెషల్ డ్రైవ్ లో సీఐలు పీఎన్డీ ప్రసాద్, మోతిరాం, సామ నర్సయ్య, ఎస్సైలు కృష్ణయ్య, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, బిక్షం తదితరులు పాల్గొన్నారు.