- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
30 ఏళ్ల సమస్యకు పరిష్కారం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో :తెలంగాణలో ఎస్సీ జీఓను ప్రభుత్వం రిలీజ్చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం సర్కారు ఈ జీవోను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈనెల 8వ తేదీన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం పంపించగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు ఒకేలా అమలైన రిజర్వేషన్లు ఇకపై వర్గీకరణ ప్రకారం వర్తింపజేయనున్నారు. ఈమేరకు అధికారులు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో గెజిట్ విడుదల చేశారు. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అములోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన తొలి కాపిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందజేశారు. ఆయన వెంట మంత్రలు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, వన్ మెన్ కమిషన్ చైర్మన్ జస్టీస్ షమిమ్ అక్తర్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎస్సీ వర్గకరణ అమలుతో కాంగ్రెస్‌పార్టీలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డికి తొలి కాపిని అందజేసిన సందర్భంగా ఆయన మంత్రులకు ప్రత్యేకంగా స్వీట్లు అందజేసి, అభినందనలు తెలిపారు.
‘‘తెలంగాణలో చరిత్రాత్మక ఘట్టం.. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన రోజు”.. అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు అంగీకరించాయి.. కానీ ఏ పార్టీ ముందుకు తీసుకువెళ్లలేదు.. కేవలం అసెంబ్లీలో చర్చకే పరిమితం అయ్యాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే కీలక అడుగు వేసి, వర్గీకరణ చేపట్టాం” అని మంత్రి వ్యాఖ్యనించారు. సోమవారం సెక్రెటేరిట్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్,వన్ మెన్ కమిషన్ చైర్మన్ జస్టీస్ షమిమ్ అక్తర్, ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు నుంచి ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తొలి జీవో కాపిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశామన్నారు. వర్గీకరణ అమలు పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే అసెంబ్లీ లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఆపై తనను చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామన్నారు. 59 ఉప కులాల్లో ఎవరు వెనుకబడి ఉన్న అంశంపై వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ విషయంలో కొన్ని వేల వినతి పత్రాలు స్వీకరించామని తెలిపారు. ప్రధానంగా వర్గీకరణపై పంజాబ్, తమిళనాడులో ఉన్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశామని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే జస్టీస్ శమిమ్ అక్తర్ రిపోర్ట్ ఇచ్చారని, దీంతో 3 గ్రూపులుగా ఎస్సీ లను డివైడ్ చేశామని పేర్కొన్నారు. అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించిన బిల్ ను కేబినెట్ ఆమోదించింది కేబినెట్, గవర్నర్ ఆమోదం తెలిపారని చెప్పారు. ఈ ప్రక్రియంతా కూడా కేవలం 8నెలల్లోనే పూర్తి చేసి, వర్గీకరణ పై జీవో 33 విడుదల చేశామన్నారు. అలాగే, అంబెడ్కర్ జయంతి సందర్భంగా జీవో 9 , జీవో 10 ని విడుదల చేశామన్నారు. ఆయా జీఓలు పబ్లిక్ డొమైన్ లో ఈ జీవోలు ఉంచామని, ఈ చట్టం ఈరోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. కేంద్ర జనాభా లెక్కలు చేసిన తరువాత కూడా రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టం చేశారు.
వర్గీకరణ అమలు తొలిరాష్ట్రం తెలంగాణ..
దేశంలో వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ నా జీవితంలో ఈరోజు మర్చిపోలేనిది” అని మంత్రి ఉత్తమ్చెప్పారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కొనసాగినప్పుడు, అటు తరువాత తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నవేళ ఎస్సీ వర్గీకరణ అమలు 30 ఏళ్లకు పైగా నానుతున్న అంశమని తెలిపారు. 30 ఏళ్ల నుంచి ఈ సమస్య పరిష్కారం కాలేదని, కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ తెలంగాణలో కుల గణన చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంకు కట్టుబడి ఉంది అనటానికి ఇదే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
నేడు ఉద్యోగ ఖాళీలపై మీటింగ్..
ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కరం అయే వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వబొమని అని ప్రకటించామని గుర్తు చేశారు. అన్నట్టుగా ఏప్రిల్ 14 వర్గీకరణ గెజిట్విడుదలయ్య వరకు ప్రభుత్వ ఒక్కజాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈవిషయంలో ఇవాళ సీఎస్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ తోపాటు ఉన్నతాధికారులు తో మీటింగ్ నిర్వహించి, అన్ని శాఖల్లో ఉద్యోగుల ఖాళీలు వివరాలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు నుంచి పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయబోతున్నామని తెలిపారు. వాటన్నింటికి కూడా వర్గీకరణ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. జీవో నంబర్ 29 ప్రకారం రోస్టర్ పాయింట్స్ కేటాయింపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
కేటీఆర్ పై ఫైర్...
ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిండెంట్కేటీఆర్ కామెంట్స్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫైర్అయ్యారు. మోసం.. దగాకు పేటెంట్కేటీఆర్ అని ఆయన విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో పదేండ్లు అధికారంలో ఉండి మీరేందుకు ఎందుకు? చేయలదేని ప్రశ్నించారు.
అసమానతలను తొలగించేందుకే వర్గీకరణ: మంత్రి దామోదర రాజనర్సింహా
వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు.. దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకే వర్గీకరణ అని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా, దళితులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మంత్రి తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసమే జీవితాంతం పరితపించిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికత, కమిట్‌మెంట్ వల్లే వర్గీకరణ ఆకాంక్ష ఇంత త్వరగా సాకారమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన ఎనిమిదన్నర నెలల కాలంలోనే వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టీస్ షమీన్ అక్తర్, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సబ్ కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, మల్లు రవి, శాసన సభ, శాసన మండలిలో వర్గీకరణకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2013లో సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సబ్ ప్లాన్ చేసే అవకాశం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సీడబ్లూసీలో సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వానికి, నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వినిపించే అవకాశం దక్కడం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం భాగమయ్యే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. తనకు అవకాశాలు ఇచ్చిన ప్రజలకు, నాయకులకు, పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.