ఎన్నాళ్లీ యాతన.. తిప్పలు పడుతున్న పాదచారులు

by Aamani |
ఎన్నాళ్లీ యాతన.. తిప్పలు పడుతున్న పాదచారులు
X

దిశ, ఘట్కేసర్ : పట్టణ కేంద్రంలో రైల్వే గేట్ మూసివేయడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడిగా నత్త నడకన సాగిన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇటీవల ముమ్మరం చేశారు. గేటు దాటి ఈ డబ్ల్యూ ఎస్ కాలనీ, బాలాజీ నగర్, కొండాపూర్ వైపు నడక దారిలో వెళ్లే వందల మంది ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకుండా రైల్వే గేటు వద్ద అడ్డంగా సిమెంటు దిమ్మలు వేశారు. మోటార్ వాహనదారులు మాధవ రెడ్డి ఫ్లైఓవర్ మీదుగా రాత్రి, పగలు కొండాపూర్ వైపు వెళ్లగలుగుతారు కానీ పాదచారులు చుట్టూ తిరిగి రెండు కిలోమీటర్ల దూరం ఎలా వెళ్తారని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, చిరు వ్యాపారులు రైల్వే గేట్ దాటి వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నామని వాపోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టింపులకు పోకుండా నడక దారిలో వెళ్లే ప్రజల కోసం రైల్వే గేటు వద్ద మార్గం ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed