- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.. వారికి నేరుగా వైకుంఠ ద్వార దర్శనం
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి (Tirupati)లోని వైకుంఠ ద్వార దర్శన (Vaikunta Dwara Darshan) టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనతో మొత్తం ఆరుగురు భక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో 57 మందికి గాయాలయ్యాయి. దీంతో వారందరినీ పోలీసులు చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రి (Ruya Hospital)కి తరలించారు. ప్రస్తుతం వారందరూ పూర్తిగా కోలుకున్నారు. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu), టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu), ఈవో శ్యామల రావు (EO Shyamala Rao)కు సంచలన ఆదేశాలు జారీ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన 52 మందికి ఉత్తర ద్వార దర్శనం చేయించాలని ఆర్డర్ వేశారు. దీంతో అధికారులు ఇవాళ తెల్లవారుజామునే క్షతగాత్రులను దగ్గరుండి శ్రీవారిని దర్శనం చేయించారు. తమకు సకాలంలో మంచి వైద్యం అందజేసి, వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి క్షతగాత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.