- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Dpdp act: డీపీడీపీ యాక్ట్‌లోని సెక్షన్ 44(3)ని రద్దు చేయాలి.. ఇండియా కూటమి డిమాండ్

దిశ, నేషనల్ బ్యూరో: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP)లోని సెక్షన్ 44 (3)ని రద్దు చేయాలని ఇండియా కూటమి (India alliance) డిమాండ్ చేసింది. ఈ సెక్షన్ సమాచార హక్కు చట్టం (Rti)ని బలహీనపరుస్తుందని ఆరోపించింది. ఈ మేరకు ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు గురువారం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ (Gowrav gogoi) మాట్లాడుతూ.. 2005 నాటి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 (1)(J)కి ప్రత్యామ్నాయంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 44 (3)ని పౌర హక్కుల కార్యకర్తలు వ్యతిరేకించారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం బహిర్గతమైనప్పుడు, అది ఏదైనా ప్రజా కార్యకలాపాలకు సంబంధించినది అయితే దానిని నిలిపివేయడానికి ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(j) అనుమతిస్తుందని తెలిపారు. అయితే ఈ పరిమితి ఒక ముఖ్యమైన రక్షణకు లోబడి ఉందని తెలిపారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా ఇండియా కూటమి పార్టీలకు చెందిన120 మందికి పైగా ఎంపీలు ఈ సెక్షన్ రద్దు కోసం ఉమ్మడి మెమోరాండంపై సంతకం చేశారని, దీనిని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అందజేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నేత ఎంఎం అబ్దుల్లా, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది, సీపీఎం నాయకుడు జాన్ బ్రిట్టాస్, సమాజ్ వాదీ పార్టీ నేత జావేద్ అలీఖాన్, ఆర్జేడీ నేత నావల్ కిషోర్ పాల్గొన్నారు.