- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ola Electric: రూ. 39,999 నుంచి ఓలా కొత్త స్కూటర్ల లాంచ్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన పోర్ట్‌ఫోలియోలో కొత్త స్కూటర్లను చేర్చింది. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం పెంచే లక్ష్యంలో భాగంగా సరసమైన ధరల్లో కొత్త ఈవీ స్కూటర్లను లాంచ్ చేసింది. ఓలా గిగ్, గిగ్ ప్లస్, ఎస్1 జెడ్, ఎస్1 జెడ్ ప్లస్ పేర్లతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ల ధర రూ. 39,999 నుంచి మొదలవుతాయి. ఈ స్కూటర్లను బుక్ చేసుకునేందుకు కేవలం రూ. 499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చని, డెలివరీలు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో ఎల్లడించింది. రూ. 39 వేలకు లభించే ఓలా గిగ్ స్కూటర్ 1.5 కిలోవాట్ అవర్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జింగ్ ద్వారా 112 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 1.5 కిలోవాట్ అవర్ డ్యూయెల్ బ్యాటరీతో వచ్చే ఓలా గిగ్ ప్లస్ రెండు బ్యాటరీలతో 157 కిలోమీటర్లు వెళ్లవచ్చు. దీని ధర రూ. 49,999గా ఉంది. 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే ఓలా ఎస్1 జెడ్ రెండు బ్యాటరీలతో వస్తుంది. ఇది 146 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ కూడా 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 146 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 64,999గా ఉంది. స్కూటర్లతో పాటు ఓలా కొత్తగా పోర్టబుల్ ఇన్వర్టర్‌ను విడుదల చేసింది. విద్యుత్ అసౌకర్యం ఏర్పడిన సమయాల్లో లైట్లు, ఫ్యాన్లు, టీవీ, మొబైల్ వాడుకునేందుకు వీలుగా రూ. 9,999 ధరలో దీన్ని తీసుకొచ్చింది.