- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి రాజీనామా చేయాలి
దిశ, వాంకిడి : విద్యార్థిని శైలజ మృతికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని ఫుడ్ పాయిజన్ తో హైదరాబాద్ నిమ్స్ లో 20 రోజుల పైగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నా కనీసం మంత్రి వెళ్లి చూసిన పాపానపోలేదని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ వసతి గృహాల్లో ఈ ఏడాది 42 ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటు చేసుకుంటే కనీసం ఎందుకు జరిగిందని ఈ ప్రభుత్వం విచారణ చేపట్టలేదని ఆరోపించారు. అదే సమయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో కూడా పూర్తిగా విఫలమైందని వాపోయారు. వచ్చే అసెంబ్లీ సెషన్లో దీని పై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
విద్యార్థిని శైలజ కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. కనీసం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఫోన్ లో మాట్లాడి బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వలేకపోయారని వాపోయారు. భారీ పోలీసులను మోహరించి కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని పేర్కొన్నారు.