CM Revanth Reddy: రక్షణ శాఖ భూములు ఇవ్వండి.. రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |
CM Revanth Reddy: రక్షణ శాఖ భూములు ఇవ్వండి.. రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ తో పాటు సీఎంవో అధికారి శేషాద్రి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూములను (Defense lands) రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్ నాథ్ సింగ్ ను సీఎం కోరారు. హైదరాబాద్ లోని బాపూ ఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం కోసం రక్షణ శాఖ స్థలాలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు.

కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించండి:

తెలంగాణలో వరంగల్ తో పాటు భద్రాద్రి కొత్త గూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. రాజ్ నాథ్ సింగ్ తో భేటీకి ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttham Kumar Reddy), కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రితో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అవసరమైన 253 ఎరకరాల భూసేకరణ కోసం రూ. 205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ఎయిర్ పోర్టును పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

వంద శాతం సహకరిస్తాం:రామ్మోహన్ నాయుడు:

సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. వరంగల్‌లో కచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తామని వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా కొత్తగూడెం దగ్గర ఎయిర్‌పోర్ట్‌కు అనువైన స్థలం ఉందని సీఎం చెప్పారన్నారు. త్వరలో పెద్దపల్లి, కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామని తెలిపారు. పెద్దపల్లిలో విమనాశ్రయం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. వరంగల్‌ ఎయిర్‌ పోర్టుకు భూ సేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story