కొడుకు చేతిలో తండ్రి హతం.. డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో..

by Aamani |
కొడుకు చేతిలో తండ్రి హతం.. డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో..
X

దిశ, మక్తల్: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తండ్రిపై దాడి చేసి రోకలితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరిపల్లి గ్రామంలో సోమవారం మధ్యరాత్రి జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి చెల్లెలు శైలేటి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం కై మంగళవారం సాయంత్రం మక్తల్ ఆస్పత్రికి తరలించారు.

కాగా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. దాసరి పల్లి గ్రామానికి చెందిన కొత్రికొండ రాములు (48)ఇటీవలనే కూతురు పెళ్లి చేయగా ప్రభుత్వం నుండి కళ్యాణ లక్ష్మి మంజూరు కాగా అందులో కొన్ని డబ్బులు తనకి ఇవ్వాలని కొడుకు మల్లేష్ గత కొన్ని రోజులుగా తండ్రితో గొడవ పడేవాడు. సోమవారం రాత్రి మద్యం తాగి తండ్రితో ఇంట్లో గొడవపడి పక్కనే ఉన్న రోకలి బండతో తలపై మొదడంతో తండ్రి రాములు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జరగగానే కొడుకు మల్లేష్ ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా మళ్ళీ మద్యం తాగేందుకు వెళ్ళాడు. ఉదయమే ఈ విషయం బహిర్గతం కావడంతో మృతుడి చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.

Advertisement

Next Story