భవిష్యత్​ సమస్యలకు పరిష్కారాలు చూపాలి

by Sridhar Babu |
భవిష్యత్​ సమస్యలకు పరిష్కారాలు చూపాలి
X

దిశ,ఉప్పల్ : భవిష్యత్​ సమస్యలకు పరిష్కారాలు చూపాలని వక్తలు కోరారు. లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో తార్నాకలో రైతులు- రాజ్యాంగం, భూమి సంవాద్ పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాసినప్పటికీ, దానిని సృజనాత్మకంగా ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్​లో తలెత్తే సమస్యలకు పరిష్కారాలను చూపించవచ్చునని అభిప్రాయపడ్డారు. నేటి వ్యవసాయ రంగ సమస్యలు, పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను అణ్వయించుకోవడం, కొత్త భాష్యం చెప్పడం ద్వారా పరిష్కారించుకోవడానికి అవకాశం ఉందన్నారు.

రాజ్యాంగాన్ని ఇప్పటికిప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. గతంలో దాదాపు 24 రకాలైన పంటలు పండిస్తే నేడు ఏక పంట విధానంతో వరి లాంటి కొన్ని పంటలే పడించే వైపు వెళుతున్నామన్నారు. రైతుకు అనుగుణంగా మార్కెట్ పరిస్థితులు, అప్పు, విత్తనాలు, మార్కెటింగ్, క్రిమి సంహారక మందులు అమ్మే వ్యక్తులకు రైతులకు మధ్య సంబంధాలను ఏవిధంగా నియంత్రిస్తామన్నదానిపైనే చర్చ జరగాల్సి ఉందన్నారు. భూమిపై రైతుకు, కూలీకి హక్కు ఉందనేది భారతదేశం, తెలంగాణలోనే కాకుండా యునైటెడ్ అంసెబ్లీలో తీర్మాణం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా భూమి-రైతు, గౌరవ ప్రదమైన వ్యవసాయ సమస్యలపై ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, పలువురు నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed