Cm Atishi: ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ కుట్ర.. ఢిల్లీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు

by vinod kumar |
Cm Atishi: ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ కుట్ర.. ఢిల్లీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీఎం అతిశీ (Athishi) ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAp)కు సంబంధించిన ఓటర్లను లిస్టు తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత నెల 28, 29 తేదీల్లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌లు, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లు బదిలీ చేయబడ్డారని, అప్పటి నుంచి ఓటర్ లిస్ట్ (Voter list) మార్చేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆప్ ఓటర్లను తొలగించాలని ఆదేశాలు సైతం జారీ చేశారని పేర్కొన్నారు.

ఎన్నికల అధికారులు, బూత్ స్థాయి అధికారులను భయపెడుతున్నారని నొక్కి చెప్పారు. ఆప్ మద్దతుదారుల జాబితాను అధికారులకు అందజేశారని, వారిని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు సైతం ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోవద్దని బీజేపీ కుట్రలను బహిర్గతం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని (Democracy) బతికించడానికి ముందుకు రావాలని చెప్పారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆప్ ఇప్పటికే తొలి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే అతిశీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story