Champions Trophy 2025 : చాంపియ‌న్స్ ట్రోఫీ వివాదం.. ఐసీసీ అత్యవసర సమావేశం

by M.Rajitha |
Champions Trophy 2025 : చాంపియ‌న్స్ ట్రోఫీ వివాదం.. ఐసీసీ అత్యవసర సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : వ‌చ్చే ఏడాది జ‌ర‌గాల్సిన‌ చాంపియ‌న్స్ ట్రోఫీపై గంద‌ర‌గోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆడించేందుకు భార‌త క్రికెట్ బోర్డ్(BCCI) సిద్ధంగా లేక‌పోవ‌డం.. హైబ్రిడ్ మోడ‌ల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స‌సేమిరా అనడమే అందుకు కార‌ణం. దాంతో అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి(ICC) న‌వంబ‌ర్ 11న జ‌ర‌గాల్సిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఈవెంట్‌ను కూడా ర‌ద్దు చేసింది. ఇటు బీసీసీఐ, అటు పీసీబీలు పంతం వీడ‌కపోవడంతో.. ఈ వివాదంపై నవంబ‌ర్ 26న ఐసీసీ అత్యవ‌స‌ర‌ స‌మావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. చాంపియ‌న్స్ ట్రోఫీ వేదిక ఖ‌రారు చేయ‌డమే కాకుండా దాయాది బోర్డుల‌ను ఒప్పించ‌డ‌మే ప్రధాన అజెండాగా ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది.

Advertisement

Next Story

Most Viewed