- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Russia : ఉక్రెయిన్‌పై ‘హైపర్ సోనిక్’ దాడి పశ్చిమ దేశాలకు వార్నింగ్ : రష్యా
దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్(Ukraine)పై తొలిసారిగా హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్(hypersonic missile)తో చేసిన దాడిపై రష్యా(Russia) కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకే ఆ దాడి చేశామని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు నిర్లక్ష్యపూరిత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పర్యవసానాలు ఉంటాయనే సందేశాన్ని ఇచ్చేందుకే ఆ దాడి చేసినట్లు స్పష్టంచేశారు.
‘‘పశ్చిమ దేశాల మిస్సైళ్లతో మాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఊరుకోం. ఉక్రెయిన్‌కు ఆ మిస్సైళ్లు ఇచ్చిన దేశాలపైనా తప్పకుండా ప్రతీకార దాడి చేస్తాం’’ అని పెస్కోవ్ తేల్చి చెప్పారు. ఇటీవలే ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ మిస్సైల్‌తో దాడి చేయడానికి 30 నిమిషాల ముందు అమెరికాకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్రిక్తతలను పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని పెస్కోవ్ ఆరోపించారు.