Namrata Shirodkar: క్రిస్మస్ సందర్భంగా సూపర్‌స్టార్ సతీమణి ఆసక్తికర పోస్ట్

by Anjali |
Namrata Shirodkar: క్రిస్మస్ సందర్భంగా సూపర్‌స్టార్ సతీమణి ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు సినిమాల్లో నటిస్తోన్న క్రమంలోనే తోటి నటి నమ్రత శిరోద్కర్‌(Namrata Shirodkar)తో ప్రేమలో పడ్డారు. వంశీ(Vamsi) చిత్రంతో ఒక్కటైన ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నమ్రత అండ్ సూపర్ స్టార్ వివాహమై 18 సంవత్సరాలు గడుస్తోన్న అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త, అత్తమామ మాటల్ని జవదాటకుండా హిందూ సంప్రదాయాల్ని పాటిస్తూ నమ్రత శిరోద్కర్ కోడలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. పెళ్లాయ్యాక కూడా నమ్రతకు సినిమాల్లో నటించే చాన్స్ వచ్చిందని, కానీ తనే రిజెక్ట్ చేసిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

వివాహనంతరం పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. ఇక 2005 లో వివాహమైన ఈ క్యూట్ కపుల్ కు ‘గౌతమ్-సితార’ (Gautham-Sitara) జన్మించారు. చైల్డ్ ఆర్టిస్టుగా గౌతమ్ మహేష్ బాబు సినిమాలో నటించారు. సితార కూడా నాన్నతో కలిసి ఓ చిత్రంలో దుమ్మురేపే స్టెప్పులేసి..తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తరచూ సితార, గౌతమ్ సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో జనాల్ని అలరిస్తూనే ఉంటారు. అయితే నేడు క్రైస్తవులంతా ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ(Christmas festival). ఈ వేడుక ప్రతి ఏటా డిసెంబరు 25 వ తేదీన వస్తుంది. కాగా నమ్రత శిరోద్కర్ తాజాగా ‘నా ప్రపంచంలో కొంత సమయం క్రిస్మస్.. అందరికీ మెరీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. హ్యాపీ హాలీడేస్’ అంటూ సోషల్ మీడియా వేదిక పిల్లలు గౌతమ్, సితారతో ఉన్న ఫొటోలు పంచుకుంది.




Advertisement

Next Story