- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందువుల సంరక్షణకు గ్రామాల్లో బజరంగ్ దళ్ కమిటీలు : నీరజ్ గోనేరియా
దిశ,ఆందోల్: హిందువుల సంరక్షణ కోసం గ్రామగ్రామాన బజరంగ్ దళ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, హిందుత్వాన్ని అంతం చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అఖిలభారత బజరంగ్ దళ్ సంయోజక్ నిరాజ్ గోనేరియా అన్నారు. బుధవారం ఆందోల్-జోగిపేట మున్సిపల్ పట్టణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శౌర్య యాత్ర ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. హిందువులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. భారతదేశంలో ధర్మ కార్యక్రమం చేయడానికి కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇది హనుమంతుని సైన్యమని ఎంతటి కఠినమైన కార్యక్రమమైన సులువుగా నిర్వహిస్తామన్నారు. లవ్ జిహాద్ నుంచి అమ్మాయిలను కాపాడడానికి బజరంగ్ దళ్ అండగా నిలుస్తుందన్నారు. గోమాతల రక్షణ కోసం ప్రాణాలను తెగించి నిరంతరం పోరాటం చేస్తామని, గత 20 ఏళ్ల నుంచి 90 లక్షల గోవులను రక్షించామన్నారు. శివాజీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ నేతాజీ నడచిన బాటలోనే నడుస్తామన్నారు. దేశం బోర్డర్ లో అయినా లోపలైన సైనికులుగా బజరంగ్ దళ్ పనిచేస్తుందన్నారు. హిందువులను మతం మార్చడానికి కొన్ని శక్తులు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ధర్మరక్షణ కోసం బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు నిరంతరం పోరాటం చేయాలన్నారు. దీనికి ముందు నాయకులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, క్షేత్ర బజరంగ్ దళ్ సంయోజక్, దర్మప్రసార్ సహ ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్, ప్రాంత బజరంగ్ దళ్ సంయోజక్, విభాగ్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, జిల్లా దర్మప్రసార్ ప్రముఖ్ మ్యాదరి దివాకర్, జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షుడు ప్రభు కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జోగిపేటలో భారీగా ర్యాలీ..
జోగిపేటలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య యాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు. జైశ్రీరామ్ అనే నినాదాలతో పట్టణమంతా మార్మోగోగా, భారత్ మాతాకీ జై అంటూ ర్యాలీని కొనసాగించారు. స్థానిక వాసవి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన శౌర్య యాత్ర ర్యాలీ క్లాక్ టవర్, గౌని చౌరస్తా, బసవేశ్వర, హనుమాన్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా కొనసాగింది. పెద్ద ఎత్తున ఆయా గ్రామాల నుంచి బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.