- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tragedy: తెలంగాణలో మరో దారుణం.. ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలవన్మరణం
దిశ, వెబ్‌డెస్క్/జవహర్ నగర్: రాష్ట్రంలో యువతులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆకతాయిల ఆగడాలకు ఎండ్ కార్డ్ మాత్రం పడటం లేదు. లైంగికంగా వేధిస్తూ ఒకడు.. ప్రేమ పేరుతో వెంటపడుతూ మరొకడు ఇలా ఎక్కడో ఒక చోట నిత్యం యువతులు మానసిక వేదనకు గురై ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మేడ్చల్ జిల్లా (Medchal District)లో ఘోరం చోటుచేసుకుంది. న్యూ భవానీ నగర్ కాలనీలో నివాసముంటున్న పొనగంటి హారిక, తానీషా దంపతులు గత 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వారికి కూతురు పూర్ణిమ (19), కుమారుడు (14) ఉన్నారు. అయితే కూతురు పూర్ణిమ ఒమేగా మహిళా కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కాలేజీకి వెళ్తున్నానని బయలుదేరింది.
అనంతరం కుటుంబ సభ్యులు ఉదయం 9 గంటలకు పని వెళ్లారు. ఇది ఇలా ఉండగా.. పూర్ణిమ సుమారు మధ్యాహ్నం 3.30కి కళాశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెకు ఫోన్ వచ్చిన కొద్దిసేపటికే బాత్ రూంలోకి వెళ్లిన పూర్ణిమ అక్కడే ఉన్న యాసిడ్ తాగేసింది. ఈ క్రమంలోనే అటుగా ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థులు పూర్ణిమను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం వారు ఇంటికి చేరుకుని సమీపంలోని విజయ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఓఎక్స్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పూర్ణిమ మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తును ప్రారంభించారు.
కాగా, కొన్నాళ్ల నుంచి పూర్ణిమను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, మంగళవారం పూర్ణిమ ఫోన్ కాల్ చేసింది ఎవరు.. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు, ఆత్మహత్యకు ఎందుకు చేసుకుందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.