Boat capsize: గోవా బీచ్‌ సమీపంలో టూరిస్టు బోటు బోల్తా.. ఒకరు మృతి

by vinod kumar |
Boat capsize: గోవా బీచ్‌ సమీపంలో టూరిస్టు బోటు బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గోవాలోని కలంగుటే బీచ్‌ (Calangute beach) సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టూరిస్టు బోటు బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలంగుటే బీచ్‌కు దగ్గర్లో ప్రయాణికులతో కూడిన బోటు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడటంతో టూరిస్టులంతా సముద్రంలో పడిపోయారు. తీర ప్రాంతానికి సుమారు 60 మీటర్ల దూరంలో ఈ ఘటన జరగగా విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. 13 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. కాపాడిన వారిని ఆస్పత్రికి తరలించగా పడవ కింద చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఇన్‌చార్జ్ లైఫ్‌గార్డ్ సంజయ్ యాదవ్ (Sanjay yadav) తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు ప్రయాణికులు మినహా మిగతా వారంతా లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని పేర్కొన్నారు. పడవలోని ప్రయాణికుల్లో ఆరేళ్లలోపు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు.

Advertisement

Next Story

Most Viewed