Jani Master: అల్లు అర్జున్ కారణంగా జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడా? వెలుగులోకి అసలు నిజం (వీడియో)

by Hamsa |
Jani Master: అల్లు అర్జున్ కారణంగా జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడా? వెలుగులోకి అసలు నిజం (వీడియో)
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు పలు కేసుల్లో చిక్కుకుంటూ అరెస్ట్ అయి జైలుకి వెళ్లి వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ లేడీ అసిస్టెంట్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ జానీ మాస్టర్‌(Jani Master)పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఆయన అరెస్ట్‌కు కారణం అల్లు అర్జున్ అని గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ విషయంపై జానీ మాస్టర్ ప్రస్తావించారు.

మీ అరెస్ట్‌కు అల్లు అర్జున్(Allu Arjun) కారణం అంటూ వార్తలు వచ్చాయి కదా దీన్ని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అని ప్రశ్నించగా.. ఆయన ‘‘థాంక్యు సో మచ్.. జై హింద్’’ అని చెప్పి పక్కకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు జానీ మాస్టర్ అరెస్ట్‌లో ఐకాన్ స్టార్‌కు సంబంధం లేదని క్లారిటీ వచ్చేసింది. అసలు విషయంలోకి వెళితే.. సంధ్య థియేటర్స్ ఘటనలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించడానికి జానీ మాస్టర్ హాస్పిటల్‌కు వెల్లారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కామెంట్స్ చేయడంతో పాటు అల్లు అర్జున్ వల్ల తను అరెస్ట్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed