వందేళ్ల ఉత్సవం.. కిక్కిరిసిన భక్తజనం..!

by Aamani |
వందేళ్ల ఉత్సవం.. కిక్కిరిసిన భక్తజనం..!
X

దిశ, మెదక్ ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద చర్చి లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశ, విదేశాల నుంచి మెదక్ చర్చి లో జరుగుతున్న వందేళ్ల క్రిస్మస్ వేడుకల కోసం తరలి వచ్చారు. ప్రాతఃకాల ప్రార్థనలో మొదలైన కరుణమయుడి స్మరణ భక్తుల నినాదాలతో మారుమోగింది. యేసయ్య సన్నిధిలో వేడుకగా సాగుతున్న శతాబ్ది ఉత్సవాల్లో సామాన్య భక్తుడి తో పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని పరవశం చెందారు.


ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి లో బుధవారం నూరేళ్ళ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఘనంగా వంద సంవత్సరాల, క్రిస్మస్ వేడుకలు.. ఉదయం నాలుగున్నర గంటలకు మొదటి ఆరాధన ప్రారంభమైంది. ఈ సందర్భంగా శిలువను ఊరేగింపుగా మహాదేవాలయంలో ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో సిఎస్ఐ చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ పోస్నెట్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి బిషప్ రూబెన్ మార్క్ దైవ సందేశం వినిపించారు. 100 సంవత్సరాల చరిత్ర గల చర్చిలో మనం అందరం ఉండటం అదృష్టమని, ఆ దేవుడు ఆశీర్వదించబడిన బిడ్డలమన్నారు. ఇది మన జీవితంలో ఒక మైలురాయి గా నిలిచిపోతుందన్నారు. లోక రక్షకుడు ఉంటే ఎవరికి భయం ఉండదన్నారు. లోకరక్షకుని జననం జనులకు సంతోషధాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ బీటర్ ఇంచార్జీ శంతయ్యా, మత గురువులు, చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


చర్చి వేడుకల్లో సీఎం తో పాటు మంత్రులు

మెదక్ చర్చి లో జరుగుతున్న వందేళ్ల క్రిస్మస్ ఉత్సవాల్లో రాష్ట్రానికి చెందిన ముఖ్యులు హాజరు వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చి వందేళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, సంజీవ్ రెడ్డి, మదన మోహన్, మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు లు హాజరయ్యారు. జన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, బీ అర్ ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి లు వందేళ్ల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పోటెత్తిన భక్తజనం..

మెదక్ మహా దేవాలయం చర్చి లో సాగుతున్న వందేళ్ల క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. చర్చి ఆవరణలో ఎక్కడ చూసినా జనం తో పోటెత్తింది. ఉదయం నుంచి రాష్ట్ర వరకు చర్చి సందర్శన కోసం వస్తూనే ఉన్నారు. భక్తుల తాకిడి దృశ్య మెదక్ ఆర్టీసీ తో పాటు ఇతర డిపో లకు చెందిన ప్రత్యేక బస్సులు సైతం మెదక్ కు నడిపారు. భక్తుల తాకిడి వల్ల మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ కూడా పెరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్చి చుట్టూ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టి ఇతర వాహనాలు రాకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చెప్పారు. పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చర్చి కి వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed