అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,కాల్వ శ్రీరాంపూర్ : అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంకంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అంకంపల్లి గ్రామానికి చెందిన జిల్లాల ఆగయ్య 50 వృత్తి రీత్యా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి రాకేష్, రమేష్ ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు రమేష్ (27) వృత్తిరీత్యా సెంట్రింగ్ పని చేస్తూ మూడు సంవత్సరాల నుండి మంచిర్యాలలో జీవిస్తున్నాడు.

అయితే అప్పులు తీసుకొచ్చి సెంట్రింగ్ సామానులను కొనుగోలు చేశాడని, అప్పులు అధికం అవడంతో మనస్థాపం చెంది మంగళవారం సాయంత్రం తన ఇంటి ఆవరణలో గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు. మృతుని భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed