Samantha: ప్రముఖ బ్యాడ్మింటన్ పీవీ సింధు పెళ్లిపై సమంత రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్

by Kavitha |
Samantha: ప్రముఖ బ్యాడ్మింటన్ పీవీ సింధు పెళ్లిపై సమంత రియాక్షన్ ఇదే.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దల నొప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది.

ఇక రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇదిలా ఉంటే.. సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ ఓ పోస్ట్ పెట్టింది. అందులో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, వెంకట్ దత్తల మ్యారేజ్ ఫొటో షేర్ చేస్తూ.. ‘మీ ఇద్దరికీ అభినందనలు.. మీరు ఎప్పటికీ ఇలానే చాలా హ్యపీగా, అందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed