- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం నగరపాలక సంస్థలో షాడో అసిస్టెంట్ కమిషనర్..
ఖమ్మం నగరపాలక సంస్థలో అతను ఓ సీనియర్ అసిస్టెంట్, పైగా అతనికి ఆర్బి బాధ్యతలను సైతం ఇటీవలే అప్పగించారు. కానీ ఆయన ఇప్పుడు షాడో అధికారిగా చలామణి అవుతూ.. కింది స్థాయి ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇదే మాదిరిగా ఉద్యోగులను వేధింపులకు గురి చేసి పోలీస్ కేసులను ఎదుర్కొని ఇతర మున్సిపాలిటీలకు వెళ్లినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని తోటి ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఉన్నత అధికారికి నమ్మిన బంటులా పనిచేస్తూ.. వ్యక్తిగత పనులు చక్కదిద్దుతూ ఆయన మన్నలను పొందుతూ.. ఇతర ఉద్యోగులను సైతం వారి శాఖల్లోనూ చొచ్చుకపోతూ లేని తప్పులను ఎత్తి చూపుతున్నట్లు విమర్శలు వినపడుతున్నాయి. వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 'కలెక్షన్'కు కూడా తెరలేపారని ఆరోపణలు ఉన్నాయి. రాబడి అధికంగా ఉన్న వాణిజ్య ప్రాంతాలు కలిగిన డివిజన్లకు ఓ వైపు సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐగా బాధ్యతలు చేపట్టారు. అసలు విధులను పక్కన పెట్టి కొసరు పనులు చేస్తూ.. నిత్యం ద్వితీయ ముఖ్య అధికారి వెంట తిరుగుతూ ఆయన కనుసన్నల్లో పనిచేయడం ప్రధాన ఉద్యోగంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగర పాలక సంస్థలో ద్వితీయ శ్రేణి అధికారి స్థానంలో ఒక చోట ఉద్యోగి షాడో అధికారిగా చలామణి అవుతూ.. కింది స్థాయి ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇదే మాదిరిగా ఉద్యోగులను వేధింపులకు గురి చేసి పోలీస్ కేసులను ఎదుర్కొని ఇతర మున్సిపాలిటీలకు వెళ్లినా తనలో ఎలాంటి మార్పు రాలేదని తోటి ఉద్యోగులు విమర్శిస్తున్నారు. సదరు ఉద్యోగి తిరిగి ఖమ్మం నగర పాలక సంస్థలో తిష్టవేసి మళ్లీ అదే తీరుగా వ్యవహరిస్తూ ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగులంతా బాహాటంగా వాపోతున్నారు. తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని తానే అధికారిగా వ్యవహరిస్తూ కింది స్థాయి ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్న ఇతని వ్యవహార శైలి పై ఇటీవల నగర పాలక సంస్థలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
ఖమ్మం నగరపాలక సంస్థలో అతను ఓ సీనియర్ అసిస్టెంట్, పైగా అతనికి ఆర్బి బాధ్యతలను కూడా ఇటీవలనే అప్పగించారు. కాని ఇప్పుడు ఆయన చేసే డ్యూటీ ఏంటి అంటే నగరపాలక సంస్థలో అసిస్టెంట్ కమిషనర్‌కు సీసీ మాదిరిగా చలమణి అవుతున్నారు. ఉదయం లేచిన నాటి నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యం సదరు అధికారి అసిస్టెంట్ కమిషనర్ వెంట తిరగడం పనిగా పెట్టుకొని ఇతర ఉద్యోగుల పై పెత్తనం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతే కాక ఆ ఉన్నత అధికారికి నమ్మిన బంటులా పని చేస్తూ వ్యక్తి గత పనులు చక్కదిద్దుతూ ఆయన మన్నలను పొందుతూ.. ఇతర ఉద్యోగులను సైతం వారి శాఖల్లోనూ చొచ్చుకపోతూ లేని తప్పులను ఎత్తి చూపుతున్నట్లు విమర్శలు వినపడుతున్నాయి. ఈయన వ్యవహారం ఎంతవరకు వెళ్ళింది అంటే ఆ ఉన్నత అధికారిని వారంతపులో రాష్ట్ర రాజధానికి తీసుకెళ్లే స్థాయికి చేరింది. నగర పాలక సంస్థ అధికారులపై, కింది స్థాయి ఉద్యోగులపై సదరు అధికారికి లేనిపోని విషయాలను కల్పించి చెప్పి, వేధింపులకు గురిచేయడం 'టార్గెట్ గా పెట్టుకున్నట్లు బాధిత ఉద్యోగులు లోలోనా మదన పడుతున్నారు.
కలెక్లన్ల పర్వానికి..
వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 'కలెక్షన్'కు కూడా తేరలేపడం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారిగా మాయ మాటలు చెప్పి ఇటీవల కార్యాలయంలో సెక్షన్లను మార్పించారు. అంతేగాక ఆర్ఐలకు సంబంధించి డివిజన్లను ప్రక్షాళన చేయించి తనకు అనుకూలమైన డివిజన్లను కేటాయింపజేసుకున్నట్లు వాదనలు లేకపోలేదు. రాబడి అధికంగా ఉన్న వాణిజ్య ప్రాంతాలు కలిగిన డివిజన్లను సదరు ఉద్యోగి తీసుకునట్లు తెలుస్తోంది. వైరా రోడ్డు, కమాన్ బజార్, కస్బా బజార్ ఉన్న డివిజన్లకు ఆర్ఐ బాధ్యతలు చేపట్టి ఒక పక్క సీనియర్ అసిస్టెంట్, మరో పక్క రెవెన్యూ ఇన్స్ పెక్టర్ బాధ్యతలు చేపట్టిన సదరు ఉద్యోగి.. అసలు విధులను పక్కన పెట్టి కొసరు పనులు చేస్తూ.. నిత్యం ద్వితీయ ముఖ్య అధికారి వెంట తిరుగుతూ ఆయన కనుసన్నల్లో పనిచేయడం ప్రధాన ఉద్యోగంగా మారింది.
కార్యాలయంలో అధికారుల పనితీరు, కింది స్థాయి సిబ్బంది గురించి సదరు అధికారికి లేనిపోని మాయ మాటలు కల్పించి చెప్పి ఆయన్ని తప్పుదారి పట్టించడమే కాకుండా ఉద్యోగులను ఎవరినీ కలువనివ్వకుండా అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక గతంలో ఈయనపై పలు ఆరోపణలు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నప్పటికీ ఇతనికి ఖమ్మం నగర పాలక సంస్థల్లో స్థానం కల్పించినప్పటికీ ఇతను తీరు మారకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకొని ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు.
నా వద్ద సీసీగా విధులు నిర్వహించడం లేదు.. అసిస్టెంట్ కమిషనర్
తను నా వద్ద సీసీగా విధులు నిర్వహించడం లేదు. కేవలం ఆర్ఐ హోదాలోనే తనను కలుస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుతోనే ఈ సంఘటనలు తలెత్తుతున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల వ్యక్తిగత విషయాల్లో ఉన్నత అధికారులు ఎటువంటి జోక్యం చేసుకోరు అంటున్నారు అసిస్టెంట్ కమిషనర్.