జైలు శిక్ష భయంతో ఆత్మహత్య

by Sridhar Babu |
జైలు శిక్ష భయంతో ఆత్మహత్య
X

దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామానికి చెందిన గన్నేరువరం చంద్రయ్య (35) అనే వ్యక్తి జైలు శిక్ష భయంతో ఈనెల 19 న ఆత్మహత్యకు పాల్పడగా ఆరు రోజులు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారని ఎస్సై ఉమసాగర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజారాంపల్లి గ్రామానికి చెందిన గన్నేరువరం చంద్రయ్యపై అదే గ్రామానికి చెందిన సిరిమల్ల లీలావతి 2015లో ఓ కేసు పెట్టింది.

ప్రస్తుతం ఆ కేసు ట్రయల్ కు రాగా తనకు జైలు శిక్ష పడుతుందని భయం పట్టుకుంది. తన హార్వెస్టర్ కూడా సరిగా నడవక పోవడంతో ఆర్థికంగా రూ.2 లక్షలు నష్టపోయాడు. దీనికి తోడు మరో రూ.3 లక్షలు అప్పులు అయ్యాయి. కేసులో జైలు శిక్ష పడుతుందనే తీవ్రమైన మానసిక వేధనకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది ఈనెల 19న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన అతన్ని బంధువులు ఆసుపత్రికి తరలించగా ఆరు రోజులు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed