Madhira: అన్ని మతాల సారాంశం మానవత్వమే.. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Goud |
Madhira: అన్ని మతాల సారాంశం మానవత్వమే.. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, వెబ్ డెస్క్: అన్ని మతాల సారాంశం మానవత్వమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. తన సొంత నియోజకవర్గమైన మధిర(Madhira) పర్యటనలో ఉన్న ఆయన.. కిస్మస్ సందర్భంగా మధిర మండలం బయ్యారం(Bayyaram) గ్రామంలో జరిగిన వేడుకల్లో (Kistmas Celebrations) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని.. ఏసుక్రీస్తు(Jesus Christ) ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. అలాగే పరాయి వ్యక్తులకు సహాయం చేస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నంలో భాగంగా మధిర ప్రజలు తనను శాసన సభకు పంపారని అన్నారు.

తద్వారా వచ్చిన అధికారాన్ని పూర్తిగా ఈ ప్రజల కోసమే వినియోగించాలని, వారి సంక్షేమం కోసమే వాడాలని, అలా వాడటానికి కావల్సిన శక్తిని, ధైర్యాన్ని, మార్గాన్ని ఆ భగవంతుడు తనకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతేగాక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకమని, శాంతి, సహనం, కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం అని సూచించారు. ఏసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుందని, అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుందని అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు(Merry Christmas) తెలియజేశారు.

Advertisement

Next Story