- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి కుటుంబం ఆనందంతో వెల్లివిరియాలి : తాండూరు ఎమ్మెల్యే
దిశ, పెద్దేముల్: యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ సందర్భంగా పెద్దేముల్ మండల కేంద్రంలోని మెథడిస్ట్ చర్చిలో క్రైస్తవుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నూతన చర్చి నిర్మాణానికి క్రైస్తవులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగని, ప్రపంచశాంతికి మనమందరం కలిసి ఉంటూ సాటి మానవుల పట్ల దయ,క్షమ ప్రేమ కలిగి ఉండే విధంగా మానవాళికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఏసుప్రభు అని అన్నారు.
ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి హృదయం, ప్రతి కుటుంబంలో ఆనందంతో వెల్లివిరియాలని క్రిస్మస్ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దారా సింగ్, టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభ రాణి, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు లోంక నర్సింహులు, జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఎర్ర బాలప్ప, కోళ్ల పెంటప్ప, ఎర్ర రవీందర్ పడగల రవీందర్, గోపాల్, మల్లయ్య, మాజీ వార్డు సభ్యులు మల్లేశం, చర్చి లెమన్ సామెల్, తిమ్సాన్పల్లి సంజీవ, క్రైస్తవ మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.