నారాయణపేట జిల్లాలో మంత్రి బండి సంజయ్ పర్యటన

by Naveena |
నారాయణపేట జిల్లాలో మంత్రి బండి సంజయ్ పర్యటన
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నేడు నారాయణపేట జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించనున్నారు. మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని రాయికోడ్ తదితర గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను మంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. అనంతరం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కలెక్టర్, ఎస్పీ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించే సమావేశంలో మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు తమ శాఖల పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంబంధిత నివేదికలను సిద్ధం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed