Heavy Rains:అల్పపీడనం ఎఫెక్ట్.. వర్షాలతో రైతన్నలకు భారీ నష్టం

by Jakkula Mamatha |   ( Updated:2024-12-25 14:31:16.0  )
Heavy Rains:అల్పపీడనం ఎఫెక్ట్.. వర్షాలతో రైతన్నలకు భారీ నష్టం
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం(low pressure) ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు(AP Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాన్ని ఈ ఏడాది వర్షాలు వీడడం లేదనే చెప్పవచ్చు. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు రైతన్నలకు కంటి నీరు మిగుల్చుతున్నాయి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ(Telangana)లో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.

దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన వరి పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీటి పాలైనట్లు రైతులు(Farmers) వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు TGలోని భూపాలపల్లి జిల్లాలోని మహా‌ముత్తారం మండలం, ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీటి పాలైందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed