Breaking News : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

by M.Rajitha |   ( Updated:2024-11-22 17:25:10.0  )
Breaking News : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో ముఖ్య ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Residential Schools) 2వ దశ లిస్టును విడుదల చేసింది. ఈ దశలో 26 నియోజకవర్గాలకు స్కూల్స్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇదివరకే 28 నియోజకవర్గాలకు మంజూరు చేసిన సర్కార్.. రెండో విడతలో మరో 26 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు అనుమతులు మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే దగ్గర విద్యనభ్యసించడానికి ప్రభుత్వం ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది.


Advertisement

Next Story

Most Viewed