EPFO: యూఏఎన్ ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోండి

by Mahesh Kanagandla |
EPFO: యూఏఎన్ ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోండి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్యోగులు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం(ELI Scheme) ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందడానికి వారు తమ యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఖాతా(UAN Account)ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇందుకు అవసరమైతే జోనల్, ప్రాంతీయ కార్యాలయాల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన ఈఎల్ఐ పథకం ప్రయోజనాలు ఎక్కువ మంది ఉద్యోగులు, యజమానులకు చేరడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించింది. ఉద్యోగుల యూఏఎన్ యాక్టివ్‌గా ఉండటానికి యజమానులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ.. ఈపీఎఫ్‌ఓ‌ను ఆదేశించింది. యూఏఎన్ యాక్టివ్‌గా ఉంచుకోవడంతో పీఎఫ్ పాస్‌బుక్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడం, విత్ డ్రాలు, అడ్వాన్సులకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ, బదిలీలు, వ్యక్తిగత సమాచార అప్‌డేట్ల వంటి సేవలను సకాలంలో వినియోగించుకోవడానికి ఉపకరిస్తుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed