- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video: ఫుట్ బాల్ ఆడిన కోడిపుంజు.. నెటిజన్ల లైకుల వర్షం

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా (Social media) పుణ్యమా ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లోనే మన అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా జంతువులు చేసే వింత వింత పనులు, అల్లరి చేష్టలు, ఆశ్చర్యమైన సంగతుల వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం వీటికి సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోడి పుంజుకు (Cock) సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. అంతేకాదు, వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిస్తున్నారు.
సాధారణంగా మనం పెంపుడు కుక్కలు, పిల్లులు, ఏనుగులు బంతి ఆటలు ఆడటం చూస్తుంటాం. కానీ, పక్షి జాతులు ఇలాంటి ఆటలు ఆడటం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ కోడిపుంజు బంతి ఆటతో ఎంజాయ్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఓ పార్కులో కోడిపుంజుకి బాల్ దొరికింది. ఇంకేముంది దాంతో ఫుట్ బాల్ ఆటను ప్రారంభించింది. బాల్‌పై ఎక్కి బ్యాలెన్డ్‌గా అటు ఇటు బంతిని తిప్పుతూ పార్క్ అంతా తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కోడిపుంజు రోనాల్డోకు పోటిగా తయారవుతుందంటూ కొందరు, సూపర్ టాలెంటేడ్ పుంజు అంటూ మరికొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.