పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో వ్యక్తికి పదేళ్లు జైలు

by Sridhar Babu |
పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో వ్యక్తికి పదేళ్లు జైలు
X

దిశ, వాంకిడి : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా ప్రిన్సిసల్ అండ్ సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన నగోషే వినేష్ మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని,పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు.

పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబ సభ్యులు వినేనెష్ ని అడగగా నిరాకరించాడు. దీంతో కుటుంబ సభ్యులు 20.11.2021లో వాంకిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నిందితుడిని కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష, 25 వేల రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed