- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి
by Sridhar Babu |
X
దిశ, ఆదిలాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.
గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించకుండా స్థానిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆశ, ఏఎన్ ఎం, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి గర్భిణుల పేర్లు రిజిస్ట్రేషన్ చేయించి, వారికి పౌష్టికాహారం అందించాలని కోరారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లను పీహెచ్సీల వారీగా ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Next Story