- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSNL: 2024-25 చివరి నాటికి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఆస్తుల అమ్మకం
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పుల ఊబిలో ఉన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) భూముల ఆస్తులను మానిటైజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 'ఫిబ్రవరి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ భూములను వేలం వేయడానికి ప్రభుత్వం టెండర్‌ను విడుదల చేస్తుంది' అని ఓ అధికారి తెలిపారు. సాధారణంగా, ఈ వేలం మూడు వారాల పాటు జరుగుతుంది. ఆస్తుల మానిటైజేషన్ విడతల వారీగా జరిగే అవకాశం ఉంది. రాబోయే విడతలో సుమారు రూ. 300 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. ప్రభుత్వం మార్చి చివరి నాటికి ఒప్పందాలను ముగించాలని భావిస్తోంది, చెల్లింపులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉండనుంది. ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా రెండు టెలికాం పీఎస్‌యూల రుణాన్ని తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ప్రస్తుతం, ఈ రెండు పిఎస్‌యులకు చెందిన కొన్ని ఎకరాల భూమిని విక్రయించడానికి ప్రభుత్వం బిడ్‌లను స్వీకరిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా రూ. 200-300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తక్కువ లేదా వ్యాపార కార్యకలాపాలు లేని ఆస్తులను వదులుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల ప్రధానేతర ఆస్తులను మోనటైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.