దేశవ్యాప్తంగా ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

by Mahesh |   ( Updated:2024-11-26 09:59:08.0  )
దేశవ్యాప్తంగా ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారు వివిధ కారణాల వల్ల వారి పదవులకు రాజీనామా చేశారు. అలాగే పలువురు సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం తో అటు వెళ్లారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం ఆరు రాజ్యసభ( Rajya Sabha) స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మోపిదేవి, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య రాజీనామాతో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ ఆరు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో 3, ఒడిశా, బెంగాల్‌, హర్యానాలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు(By-elections) జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది. అలాగే నామినేషన్ దాఖలు చేయడానికి డిసెంబర్ 3 నుంచి 10 వరకు అవకాశం కల్పిస్తారు. అలాగే డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, అలాగే డిసెంబర్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed

    null