Hemant Soren: ప్రధాని మోడీ, అమిత్ షాలతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ

by Y. Venkata Narasimha Reddy |
Hemant Soren: ప్రధాని మోడీ, అమిత్ షాలతో హేమంత్ సోరెన్ దంపతుల భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్ ముఖ్యమంత్రిగా(Jharkhand CM) ప్రమాణ స్వీకారం చేయనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah)లతో సమావేశమయ్యారు. ఎల్లుండి గురువారం ప్రమాణ స్వీకారానికి ముందు, హేమంత్ సోరెన్ తన భార్య కల్పనా సోరెన్‌తో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు పార్లమెంటుకు చేరుకున్నారు. అమిత్ షాను షాను కలిసిన తర్వాత సోరెన్, ఆయన భార్య కల్పన ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇప్పటికే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా సోరెన్ జార్ఖండ్‌ గవర్నర్‌ సంతోష్‌ గంగ్వార్‌ కు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

28వ తేదీన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ, అమిత్ షాలతో భేటీ అనంతరం సోరెన్ మాట్లాడుతూ, "రాబోయే రోజుల్లో కూడా ప్రధాని, అమిత్ షాలలో సమావేశాలు ఉంటాయని, రాష్ట్రాభివృద్ధి విషయమై చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మేము మా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని, మేము భారత ప్రధానీ, హోంమంత్రుల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చామన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జేఎంఎం 34 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్జేడీకి 4 సీట్లు రాగా, సీపీఎంఎల్‌కు 2 సీట్లు వచ్చాయి.

Advertisement

Next Story