Sara Ali Khan: అలీయాకు అవార్డు రావడం తట్టుకోలేకపోయాను.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Sara Ali Khan: అలీయాకు అవార్డు రావడం తట్టుకోలేకపోయాను.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్ (Sara Ali Khan). కెరీర్ బిగినింగ్‌లో ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. తన అందం నటనతో యూత్‌లో ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్న సారా.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ (Lady oriented) చిత్రాల్లో కూడా మెరుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ(Interview)లో పాల్గొన్న సారా.. స్టార్ హీరోయిన్ అలియా భట్‌(Alia Bhatt)పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘అలియా సినిమాల విషయంలోనే కాదు తన వ్యక్తిగత విషయాలను కూడా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అందుకే తను సంతోషంగా ఉంటుంది. సినీ కెరీర్‌లో ఈ స్థాయికి రావడం కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ, ఆమెకు జాతీయ అవార్డు (National Award) వచ్చినప్పుడు ఒక నటిగా నేను అసూయ పడ్డాను. అలాంటి సినిమాలో నాకు అవకాశం రాలేదనిపించింది. ఎదుటివారిని చూసి అసూయపడటం సహజం. దాని వెనక ఎంత కష్టం ఉందో అది ఎవరకీ అర్థం కాదు. ఆ కష్టాన్ని ఎవరూ చూడరు. అవార్డును మాత్రమే చూస్తాను. నేను కూడా అదే చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది సారా అలీఖాన్. కాగా.. ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్రలో నటించింది. అందులో ఆమె నటనకు గాను నేషనల్ అవార్డు వచ్చింది.

Next Story

Most Viewed