- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేవన్నపేట పంప్ హౌస్ ప్రారంభం.. మోటార్‌ను ఆన్ చేసిన మంత్రులు..

దిశ, వరంగల్ బ్యూరో : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దేవాదుల ఫేస్-3 దేవన్నపేట పంప్ హౌస్ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం దేవన్నపేట పంప్‌హౌస్‌కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, యశస్వని రెడ్డిలతో కలిసి మొదటి మోటార్‌ను ఆన్ చేసి.. ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు దేవన్నపేటలో మోటార్‌ను ఆన్ చేసిన అనంతరం.. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. రిజర్వాయర్ వద్ద పూజలు నిర్వహించారు. నీటిలోకి పూలను వెదజల్లారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే కడియం మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ఎత్తిపోతల పథకం వరప్రదాయినిగా మారుతుందన్నారు.
దేవాదులకు సంబంధించిన పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగునీటిని, తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేవాదులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు గురువారం తెల్లవారుజామున దేవన్నపేట పంప్ హౌస్‌లోని మోటార్ ట్రయల్ రన్‌ను ఇరిగేషన్ అధికారులు సక్సెస్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పంప్ హౌస్ వద్దకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకుని ప్రారంభించారు.