మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం

by Naveena |
మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం
X

దిశ,వనపర్తి : ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తి జిల్లా పరిధిలో పలు గ్రామాలలో నుండి 18 ఫిర్యాదులను,సూచనలను ఫోన్ ద్వారా డిఎం స్వీకరించారు. అందులో ప్రధానంగా వనపర్తి -పానగల్ -కొత్త పేట-బుచ్చిరెడ్డి పల్లి మీదుగా పెబ్బేరు వరకు బస్సు సర్వీస్ పున్నరుద్దరించాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ప్రయాణికులకు బస్సు షెల్టర్ ఏర్పాటు,రాత్రి 7:30 గంటల తరవాత 11గంటల మధ్య కొత్త కోట మీదుగా హైదరాబాద్ కు బస్సు సర్వీస్,పెబ్బేరు -కొత్త కోట మధ్య ఆర్డినరీ షటిల్ బస్సు సర్వీస్ నడపాలన్న ప్రజల సూచనలను స్పందిస్తూ జూన్ నెల లో ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఉన్నత అధికారుల దృష్టి కి తీసుకెళ్తామని డిఎం వేణుగోపాల్ సమాధానం ఇచ్చారు.మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం

Next Story

Most Viewed