కేసీఆర్ కృషివల్లే తెలంగాణ రాష్ట్రం : మహమ్మద్ అలీ

by Kalyani |
కేసీఆర్ కృషివల్లే తెలంగాణ రాష్ట్రం : మహమ్మద్ అలీ
X

దిశ, శంషాబాద్ : కేసీఆర్ కృషివల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ అన్నారం. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏర్పాటు చేసిన దీక్ష దివాస్ జిల్లా సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి 14 ఏళ్ల పాటు పోరాడి ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు.

ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా నీళ్లు నిధులు నియామకాలు కోసం నిర్విరామంగా పోరాడారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు అంచు వరకు పోయిన కేసీఆర్ దీక్షను చూసి అప్పటి ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది అన్నారు. ఆ కార్యక్రమాన్ని దీక్ష దివస్ గా ప్రకటించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక తాటిపైకి తీసుకువచ్చి రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా అభివృద్ధి చేశారన్నారు.

మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని రైతులకు న్యాయం ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు న్యాయం చేస్తారన్నారు. ఫార్మాసిటీకి కేటాయించిన భూముల రైతుల వద్ద తీసుకోవడానికి వెళితే రైతులు తిరగబడ్డ ఘటనలు ప్రజానీకం చూసిందన్నారు. లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. లోకచెల్లలు మహిళలని కూడా చూడకుండా ఎలా దౌర్జన్యం చేశారో అందరం చూశామన్నారు. లగచర్లలో జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా స్పందించి చర్యలకు సిద్ధమైంది అన్నారు. లగచర్ల బాధితులకు సంఘీభావంగా మహబూబాబాద్ లో పెట్టిన సభ విజయవంతమైందన్నారు.

ప్రతి గిరిజల తండా నుంచి ప్రతి ఒక్కరూ మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉందని దీనిపై కార్యచరణ రూపొందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధించడానికి కేసీఆర్ ప్రాణాలకు దిగించుకోరాడని అన్నారు. 29వ తేదీన దీక్ష దివాస్ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్తీక్ రెడ్డి,మాజీ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, దేశమళ్ల ఆంజనేయులు,కొనమొల శ్రీనివాస్, దిద్యాల శ్రీనివాస్, హన్మంతు, రాజశేఖర్ గౌడ్, జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story