- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి
దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5) భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి(TTD Additional EO CH Venkaiah Chaudhary) సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భక్తుల వసతిపై అడిషనల్ ఈవోకు ఇంజినీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 16 హాళ్లలో 8 హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తైందని, మిగిలిన పని చేయాలని ఈవోకు ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకుని పనుల వేగవంతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు. భవనంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. అలాగే పీఏసీ-5లో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాదం డైనింగ్ హాల్, కళ్యాణ కట్ట, డిస్పన్సరీ సదుపాయాలపై కూడా వెంకయ్య చౌదరి అధ్యయనం చేశారు.