- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : ఎమ్మెల్యే కూనంనేని
దిశ, చైతన్యపురి : అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అదేవిధంగా అదానీ చేసుకున్న ఒప్పందాలలో ఏమైనా అవినీతి జరిగిందా అనే కోణాన్ని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో పార్టీ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చినట్టు అమెరికాలో తేలిందని ఇక్కడ ఎవరికైనా ఇచ్చారా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేస్తుందన్నారు.
వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని, పేద వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. హర్యానా ఓటమికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని వారి స్వయం కృపరాధం, స్వీయ అహంకారం తోనే ఓడిపోయిందని అదే ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో పడిందన్నారు. ఆదానిపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విచారణ చేయకపోవడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. దొంగలకు తోడ్పాటు ఇచ్చే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో ఎన్నికల్లో పాల్గొని ఆడబ్బులను జనాలకు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. మతం, సెంటిమెంట్, కులం పేరుతో చేసే రాజకీయాలు తాత్కాలికమన్నారు. మహారాష్ట్ర లాంటి ఫలితాలు మళ్లీ పునరావృతం కావని ఆయన అన్నారు.