Enviro Infra IPO: ఎన్విరో ఇన్‌ఫ్రా ఐపీఓకు అనూహ్య స్పందన.. ఏకంగా 89.90 రేట్ల సబ్‌స్క్రిప్షన్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-26 16:43:00.0  )
Enviro Infra IPO: ఎన్విరో ఇన్‌ఫ్రా ఐపీఓకు అనూహ్య స్పందన.. ఏకంగా 89.90 రేట్ల సబ్‌స్క్రిప్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సీవేజ్ ట్రీట్మెంట్ సొల్యూన్స్ ప్రొవైడర్ ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్(Enviro Infra Engineers) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO) బిడ్డింగ్ ప్రక్రియ ఈ రోజుతో(మంగళవారం) ముగిసింది. కాగా ఈ సంస్థ ఐపీవో ద్వారా సుమారు రూ. 650 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. మొత్తంగా 89.90 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. మొత్తం 3 కోట్ల షేర్లకు గాను 276 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల(QIB) నుంచి 157.05 రేట్ల సబ్‌స్క్రిప్షన్లు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల(Retail Investors) నుంచి 24.48 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII)నుంచి ఏకంగా 153.80 శాతం బిడ్లు ధాఖలయ్యాయి.

మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 195 కోట్లను సమీకరించినట్లు ఎన్విరో ఇన్‌ఫ్రా ఇదివరకే వెల్లడించింది. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో కొంత మొత్తాన్ని మూలధన అవసరాలకు, మిగిలిన నిధుల్ని లోన్స్ పే చేయడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఎన్విరో సంస్థ దేశవ్యాప్తంగా వాటర్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.

Advertisement

Next Story

Most Viewed