- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cumin Water: ఆరోగ్యానికి మేలు చేసే జీరా.. ప్రతి రోజూ ఇలా తీసుకోండి!
దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరి వంటింట్లోని పోపుల పెట్టెలో కచ్చితంగా ఉండే వాటిలో జీలకర్ర ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్ర అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ దీనిని కూరల్లో భాగంగా ఉపయోగిస్తుంటారు. దీనితో పాటుగా జీలకర్ర నీటిని ఉదయాన్నే కాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* జీలకర్రలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, కాపర్, జింక్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
* అజీర్ణ సమస్యలతో బాధపడే వారికి జీలకర్ర నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది. జీలకర్రను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
* జీలకర్రను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఇది శరీరంలోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
* నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు కాచి, చల్లార్చిన జీరా నీటిని తాగడం వల్ల బాగా నిద్రపడుతుంది.
* రక్తపోటును కంట్రోల్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్న వారు ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాడగం వల్ల క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి జీలకర్ర నీరు ఉపయోగపడుతుంది.
* ప్రతి రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల అలెర్జీ, చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More...
Fish oil: మార్కెట్‌లోకి ఫిష్ ఆయిల్.. జుట్టుకు మంచిదేనా..!!