- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kejriwal: సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి- కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ఆపేందుకు రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ‘బీజేపీకి నేరుగా వ్యవహరించే ధైర్యం లేకపోవడంతో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌తో ఫిర్యాదు చేయించింది. ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి’ అని మీడియాతో అన్నారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2,100, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ రెండు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ‘ఇప్పటికే లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపట్ల బీజేపీ భయాందోళనలకు గురవుతోంది’ అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపైనే ఆప్ ధ్వజమెత్తింది. ఈ ఉత్తర్వు ఎల్జీ కార్యాలయం నుంచి రాలేదని.. అమిత్ షా కార్యాలయం నుంచి వచ్చిందని ఆప్ ఆరోపించింది. మహిళలంటే గౌరవం లేదని.. మహిళా సమ్మాన్ యోజనను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందని పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించిందని.. ఈసారి ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పింది. ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కేంద్రం.. ఎల్జీని పావుగా ఉపయోగించుకుంటుందని ధ్వజమెత్తింది. ఆప్‌పై వచ్చిన ఆరోపణలను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఏం దర్యాప్తు చేస్తారో చూస్తామని పేర్కొన్నారు
కాంగ్రెస్ ఫిర్యాదు
ఇకపోతే, ఆప్ ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం, మహిళలకు నెలకు రూ.2,100 నగదు సాయం వంటి పథకాలను ప్రకటించింది. ఇందుకోసం ఇంటింటా తిరుగుతూ ఆప్ శ్రేణులు వివరాలు సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత వివరాలు సేకరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై, కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేశారు. మహిళా సమ్మాన్ యోజన పేరుతో ఆమ్ పార్టీ నేతలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇంటింటికి పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెళ్తున్నారని.. అంతేకాకుండా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పంజాబ్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ అవుతోందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై డివిజనల్ కమిషనర్ ద్వారా విచారణ జరిపించాలని ఎల్జీని కోరారు. కాంగ్రెస్ నేత అభ్యర్థన మేరకు ఎల్జీ విచారణకు ఆదేశించారు.ఈ మేరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌కు వేర్వేరు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని సీపీకి ఆదేశాలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి నగదు వస్తుందన్నా ఆరోపణలతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఎల్జీ ఆదేశించారు. ఈ ఆదేశాలపైనే ఆప్ విమర్శలు గుప్పించింది.