ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్

by Aamani |
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం ఏసీబీకి పట్టు పడడం తో మండలం లో కలకలం రేకెత్తింది. వివరాల్లోకి వెళితే.... శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్ రావు సర్వేనెంబర్ 352 లో విస్తీర్ణము 2.31 గుంటల భూమి లో నుండి డైరీ ఫార్మ్ కోసం 0.02.5 గుంటల భూమిని నాలా కన్వర్షన్ చేసుకోవడం కోసం డిసెంబర్ 10వ తేదీన మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపాడు. తదుపరి ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను డిసెంబర్ 23న సమర్పించగా 24వ తేదీన డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం ని కలవగా కన్వర్షన్ చేయాలంటే ఖర్చవుతుందని చెప్పి ముందుగా పదివేల రూపాయలు డిమాండ్ చేయగా రూ.ఆరు వేలు ముందగా చెల్లిస్తానని ఒప్పందం చేసుకొని బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ నగదును తీసుకుంటుండగా శని వారం వలపన్ని పట్టుకున్నట్లు తెలిపారు. మండల కార్యాలయంలో ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని నాలాంటి వారి ద్వారానైనా అధికారులు తీరు మార్చుకోవాలని బాధితుడు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed