- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > కొండాపూర్ ఏఎంబీ మాల్ లో డబ్బులు పంచుతానని హల్చల్ చేసిన ఓ వ్యక్తి
కొండాపూర్ ఏఎంబీ మాల్ లో డబ్బులు పంచుతానని హల్చల్ చేసిన ఓ వ్యక్తి
by Kalyani |
X
దిశ, శేరిలింగంపల్లి : సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడం కోసం యువత రోజుకో పిచ్చి వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మాల్ కు వచ్చే వారికి డబ్బులు ఇస్తా అంటూ బౌన్సర్లను వెంట వేసుకుని వచ్చి ప్రచారం చేసుకుంటూ హల్చల్ చేశాడు. హర్ష అనే ఇంస్టాగ్రామర్ తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కి కొండాపూర్ లోని ఏఎంబీ మాల్ రెండో అంతస్తుకు వస్తే వారికి డబ్బులు ఇస్తానన్న ప్రచారం చేశాడు హర్ష అనే ఇంస్టాగ్రామర్. నలుగురు బౌన్సర్లతో మాల్ లోకి వెళ్లిన అతను డబ్బులు ఇస్తానంటూ హల్చల్ చేశాడు. గతంలో కూడా కూకట్ పల్లిలో రోడ్లపై పైసలు గాల్లోకి వెదజల్లి హల్చల్ చేయగా అప్పట్లో అతనిపై కూకట్ పల్లి పోలీసులు అరెస్టు చేసి కేసు కూడా నమోదు చేశారు. అయినా తీరుమార్చుకోని అతను కొండాపూర్ లోని ఏఎంబి మాల్ లో హల్చల్ చేయడం గమనార్హం. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story