Akkineni Akhil: సైలెంట్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.. ట్వీట్‌తో షాకిచ్చిన నాగార్జున

by Hamsa |   ( Updated:2024-11-27 15:31:01.0  )
Akkineni Akhil: సైలెంట్‌గా అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.. ట్వీట్‌తో షాకిచ్చిన నాగార్జున
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎక్స్ ద్వారా ప్రకటించారు. జైనబ్‌(Zainab)తో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. ‘‘‘‘జైనబ్‌తో మా తనయుడి నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులను మీ ఆశీస్సులు కావాలి’’ అని ట్వీట్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు సమాచారం. అయితే డిసెంబర్‌లో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతాయని అంతా భావిస్తున్నారు.


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed