TG News : కేంద్ర విమానయాన మంత్రితో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by M.Rajitha |
TG News : కేంద్ర విమానయాన మంత్రితో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం మధ్యాహ్నం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయిడు(RamMohan Nayudu)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, అదిలాబాద్ లలో నూతన విమానాశ్రయాల(New Airports) ఏర్పాటుకు ముందుకు రావాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వీటికి సంబంధించిన భూసేకరణ, అన్నిరకాల అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ముఖ్యంగా వరంగల్ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా దీనిపై స్పందించిన రామ్మోహన్ నాయుడు.. వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హమీ ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయానికి అనువైన స్థలం ఉందని రేవంత్ రెడ్డి చెప్పారని, దానిపై సాధ్యాసాధ్యాలను పరిశిలీంచడానికి త్వరలోనే సాంకేతిక బృందాన్ని అక్కడికి పంపనున్నట్లు తెలిపారు. ఇక పెద్దపల్లి, ఆదిలాబాద్ లో విమానాశ్రయాల ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిపై మరోసారి చర్చించి.. తమ బృందాన్ని అక్కడికి పంపిస్తామని కేంద్రమంత్రి తెలియజేశారు. కాగా తమ వినతులపై సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story