Canada-India: భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలు విరమించుకున్న కెనడా

by Shamantha N |
Canada-India: భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలు విరమించుకున్న కెనడా
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా నుంచి భారత్‌ (Canada-India)కు వెళ్లే ప్రయాణికుల అదనపు భద్రతా తనిఖీలపై ఒట్టవా వెనక్కి తగ్గింది. భారత్- కెనడా మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ కు వెళ్లే ప్రయాణికులకు అదనపు భద్రతా తనిఖీలు అవసరం లేదని తేల్చి చెప్పింది. కాగా..సోమవారం కెనడా రవాణాశాఖ మంత్రి అనితా ఆనంద్‌ (Transport Minister Anita Anand) ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ముందుజాగ్రత్త చర్యలో భాగంగా భారత్‌కు ప్రయాణించే వారికి అదనపు భద్రతా తనిఖీలను (Canada enhances security screening) పెంచాం. ఈ చర్యలు అమల్లో ఉన్నప్పుడు కొన్ని ఆలస్యాలు చోటుచేసుకోవచ్చు’’ అని మంత్రి వెల్లడించారు. ఈనేపథ్యంలో భారత్ వెళ్లే ప్రయాణికులు 4 గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్ కెనడా ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఇప్పుడు, ఆ ప్రకటనపై ట్రూడో సర్కారు వెనక్కి తగ్గింది.

సిక్కు అల్లర్లు

భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్‌ ఇండియా(Air India) విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హెచ్చరించాడు. నవంబరు 1 నుంచి 19వ తేదీల మధ్యలో ఎయిర్‌ ఇండియా (Air India) విమానాల్లో ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి ప్రకటన వచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం పన్నూని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డుని ఎన్ఐఏ కూడా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది. మరోవైపు, ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ (Nijjar Murder Case) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి టైంలోనే ఇటీవల నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చింది. దీంతో, సంజయ్‌ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.

Advertisement

Next Story

Most Viewed