- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగేళ్లలో 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ డేటా పై పలు అనుమానాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ విద్యార్థుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక స్టూడెంట్లు ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ చదువుల ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పలువురు విద్యార్థులు నోట్లో ఈ విషయాన్ని నొక్కి చెప్పినా యాజమాన్యాల తీరు మారడంలేదు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఎంతమంది మరణించారనే విషయాన్ని ఆర్టీఐ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. 2020 నుంచి 2024 నవంబర్ వరకు 26 మంది మాత్రమే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. కానీ 2020 నుంచి 2024 నవంబర్ వరకు తెలంగాణ వ్యాప్తంగా 26 మంది మాత్రమే అని ఆర్టీఐ ద్వారా తేలడం గమనార్హం. దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాణాలు తీస్తున్న ‘కార్పొరేట్’ చదువు
కార్పొరేట్ చదువుల పేరిట విద్యార్థుల బంగారు భవిష్యత్ ను యాజమాన్యాలు చిదిమేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుంటూనే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మండిపడింది. ఈ సంస్థం 2020 నుంచి 2024 నవంబర్ వరకు ప్రైవేట్ కళాశాలల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా కోరగా ఇంటర్ బోర్డు కేవలం 26 మంది మాత్రమేనని తెలిపింది. తమ వద్ద ఉన్న డేటా ప్రకారం ఇంతేనని తెలిపినట్లు సమాచారం. తెలంగాణలోని ఆయా జిల్లాల అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సమాచారం అందజేస్తున్నట్లు తెలపడం గమనార్హం. ఇదేం రిపోర్టు.., ఇదేం శాఖ అని బోర్డు అధికారుల తీరుపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆర్టీఐ నివేదిక ఆధారంగా వచ్చిన వివరాలివే..
జిల్లా మరణాలు(2020-24)
ఆదిలాబాద్ 1
హన్మకొండ 4
ఖమ్మం 2
సిద్దిపేట 2
సంగారెడ్డి 2
సూర్యాపేట 1
మహబూబ్ నగర్ 2
రంగారెడ్డి 5
మేడ్చల్ 7
--------------------
మొత్తం 26
విద్యార్థుల మరణాలపై లెక్క ఉండదా
కార్పొరేట్ కళాశాలల ఒత్తిడి, ఆగడాలకు ఎంతోమంది విద్యార్ధులు నేలరాలిపోతున్నారు. ఈ విద్యాసంవత్సరం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. యాజమాన్యాలు చదువులు, ర్యాంకుల పేరుతో విద్యార్థుల ప్రాణాలను బలితీస్తున్నారు. 2020 నుంచి 2024 వరకు తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్య చేసుకున్నారని ప్రశ్నిస్తే అందుబాటులో ఉన్న సమాచారమే ఇస్తున్నామని చెప్పడమేంటి?. ఇంటర్మీడియట్ బోర్డుకు విద్యార్థుల ప్రాణాలంటే ఎంత విలువ ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది.:- రాజేంద్ర పల్నాటి, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్